Karnataka: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇటీవల కాలంలో ఇంతలా ఓడిపోవడం ఈ పార్టీకి ఇదే తొలసారి. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 136, బీజేపీ 65 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ థఆవర్ చంద్ గెహ్లాట్ కు సమర్పించారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించి కర్ణాటక పగ్గాలను బొమ్మై చేతితో పెట్టింది బీజేపీ అధిష్టానం. మొత్తం 19 నెలల 17 రోజలు పాటు బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Read Also: Mallikarjun Kharge: కర్ణాటక తీర్పుతో “బీజేపీ ముక్త్-సౌత్ ఇండియా” అయింది..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య పోటీ నెలకొంది. అయితే రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సీఎల్పీ మీటింగ్ ఉండనుంది. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలతో, కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిని తేల్చనుంది.