Karumuri Nageswara Rao: చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు. రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరని కారుమూరి విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసిందని ఆయన ఆరోపించారు.
Also Read: Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి…?. ఆయనేమైన దేవుడా, దిగొచ్చాడా…? అంటూ ప్రశ్నించారు. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారన్న కారుమూరి… వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా అంటూ ప్రశ్నలు గుప్పించారు. దేశ చరిత్రలో జైలులో ఏసీ, అటాచ్‌డ్ బాత్రూమ్ ఇచ్చినది చంద్రబాబుకే అంటూ ఆయన తెలిపారు. “చంద్రబాబు చేసిన పాపాలు ఊరికేపోవు.. చంద్రబాబు పాలనంతా స్కాములే.. చట్టానికి అందరూ సమానులే.. చంద్రబాబు పైనుంచి దిగిరాలేదు.” అని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
పేదరికాన్ని 6శాతానికి తగ్గించిన ఘనత వైసీపీదేనని…నీతి ఆయోగ్ లెక్కలే నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలన స్కామ్ లైతే వైసీపీ ప్రభుత్వం స్కీంలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.