పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని,…
Karumuri Nageswara Rao: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది.
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇంటికి వెళ్ళి రేషన్ అందించే పద్ధతి తీసేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్ వ్యవస్థను నిలిపివేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఫాలో…
నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని..
Srinivasa Varma: ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తణుకు మున్సిపాలిటీలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తించడమంటూ.. నరికేస్తాం, చంపేస్తాం.. అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టిడిఆర్ బాండ్ల విషయమై కారుమూరి…
YSRCP vs TDP: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైసీపీ నేతలతో ఎన్డీయే కూటమి నాయకులు వాగ్వాదానికి దిగారు.