Mithun Reddy vs Nara Lokesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువనేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళలతో పొలిటికల్ హీట్ పెంచారు.. దమ్ముంటే చిత్తూరు అభివృద్ధి చర్చకు తంబళ్ళపల్లె రా అని ఎంపీ మిధున్ రెడ్డికి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మదనపల్లె సభలో సవాల్ విసిరితే.. అంతే స్ధాయిలో ప్రతీ సవాల్ విసిరారు ఎంపి మిధున్ రెడ్డి.. ఈ నెల 12తేదినా తంబళ్ళపల్లెలోనే ఉంటానమి ప్లేస్ ఎక్కడో చెప్పాలని లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. నారా లోకేష్ లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తం అయితే జిల్లాలో ఏ సీటు నుండి అయినా ఫోటీ చేసి నా మీద గెలవాలన్నారు.. ఇద్దరు నేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో ఇరుపార్టీలో తీవ్ర చర్చ దారితీసింది ..
Read Also: Chevireddy Bhaskar Reddy: నా సంపాదనలో 75 శాతం ప్రజలకే ఖర్చు.. నాపై విమర్శలా?
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. బహిరంగ సవాల్ విసిరారు.. ఈనెల 12వ తేదీన తంబళ్లపల్లెలో చర్చకు నేను సిద్ధం.. ప్లేస్ ఎక్కడో చెప్పు అని చాలెంజ్ చేశారు.. చిత్తూరు జిల్లా డీఎన్‌ఏ నీ రక్తంలో ఉంటే.. నా మీద పోటీ చేయ్ రా.. అంటూ వ్యాఖ్యానించారు.. చర్చకైనా సిద్ధమే.. పోటీకి అయినా సిద్ధమేన్న మిథన్‌రెడ్డి.. 12 తేదీన తంబళ్ళపల్లె హెడ్ క్వాటర్ లోనే ఉంటాను.. నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు.. లేదా నన్ను రమ్మంటే నేను వస్తాను అని సవాల్ చేశారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమన్న ఆయన.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. ఎవరో రాసి ఇస్తే చదవడం కాదు.. చర్చకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు ఎంపీ మిథన్‌రెడ్డి..
ఇక, అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్.. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఎంపీ మిథున్‌రెడ్డికి సవాల్ విసిరారు.. చిత్తూరు జిల్లా గుప్పిట్లో పెట్టుకొని.. దోచుకోవడమే పెద్దిరెడ్డి కుటుంబం పనిగా పెట్టుకుందని ఆరోపించిన ఆయన.. మదనపల్లెకి ఏమి చేశావ్ మిథున్‌రెడ్డి అని నిలదీశారు.. దమ్ముంటే రా రేపు నేను తంబళ్లపల్లెలోనే ఉంటాను.. చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చ నేను రెడీ అని ప్రకటించారు.. మీలాగా నన్ను అరెస్టు చేయొద్దని బెయిల్ తీసుకుని టైపు కాదు నేను.. మేం తప్పు చేయము.. అభివృద్ధి మాత్రమే చేస్తాం అన్నారు నారా లోకేష్.. దీంతో.. లోకేష్.. మిథున్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వం మొదలైనట్టు అయ్యింది.