కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారని ఆయన అన్నారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. రేపు కవితను అరెస్ట్ చేయొచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసుకుంటే చేసుకోని అని, అందర్నీ వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపడేది లేదని, పోరాటం వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Zombie Virus: 48 వేళ్ల నాటి జాంబీ వైరస్‌ను మేల్కొలిపిన సైంటిస్టులు..
రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కవితను కూడా చేరమన్నారని, మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. రేపు ఈడీ ముందు కవిత హాజరుకానుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితను ఈడీ విచారించనుంది.
Also Read : CM KCR : తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓరుస్తలేదు