ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తీసుకుంటోంది. టీడీపీ జనసేతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంటే.. బీజేపీ సైతం కలవడంతో కూటమిగా బలపడింది. అయితే.. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాల్లో ఆయా పార్టీల ఆశావహులు భంగపడి మరో పార్టీలోకి పయనమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పలువురు టీడీపీ రాజీనామా చేశారు. అంతేకాకుండా కొందరు అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వైసీపీలోనూ అసంతృప్తితో రగులుతున్న నేతలు లేకపోలేదు. అయితే.. ఇప్పటికే కొందరు వైసీపీనీ వీడుతుంటే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు కొనసాగుతున్నారు.
Hijab : గుజరాత్‌లో హిజాబ్ వివాదం.. ప్రిన్సిపాల్ పై విద్యాశాఖ చర్య
అయితే.. ఈ విషయంపై మల్లాది విష్ణు స్పందిస్తూ… నేను బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం నిజం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీలోనే కొనసాగుతా అని ఆయన స్పష్టం చేశారు. నా పార్టీ వైసీపీ.. నా నాయకుడు జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కోసం.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవుబోతోందని ఆయన జోస్యం చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, 175 స్థానాల్లో విజయం కేతనం ఎగురవేస్తామన్నారు మల్లాది విష్ణు.
Russia: రష్యన్ ఆయిల్ టైకూన్ అనుమానాస్పద మృతి.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత నాలుగో ఘటన..