Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమాలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం.. ప్రజలలో నిరంతరం తిరగాలి.. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలపండి అని మాజీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
Malladi Vishnu : శాతవాహన కాలేజీని ఐదెకరాల కోసమే కూల్చేశారని మాజీ మంత్రి మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నిదర్శనమే విజయవాడలోని శాతవాహన కాలేజీని కూల్చేయడం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండానే కాలేజీని కూల్చేసిందన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఆ కాలేజీలో స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఉన్నా సరే…
YSRCP: విజయవాడలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టి, ప్రలోభాలు చూపించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిర్వాకం వహిస్తున్నారని, టీడీపీ నాయకులు బహిరంగంగా దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులేమీ…
ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావ్ ఫోన్ చాటింగ్ చిత్రాలు ఎన్ టివి చేతికి చిక్కాయి. ఎన్నికల ముందు ప్రణీతరావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు టాప్ చేసినట్లు చాటింగ్ లో వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు టాపింగ్ కు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత…
ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తీసుకుంటోంది. టీడీపీ జనసేతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంటే.. బీజేపీ సైతం కలవడంతో కూటమిగా బలపడింది. అయితే.. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాల్లో ఆయా పార్టీల ఆశావహులు భంగపడి మరో పార్టీలోకి పయనమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పలువురు టీడీపీ రాజీనామా చేశారు. అంతేకాకుండా కొందరు అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వైసీపీలోనూ అసంతృప్తితో రగులుతున్న నేతలు లేకపోలేదు. అయితే.. ఇప్పటికే…
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు... వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు…
వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది.