గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది. అయితే ఇదే విషయంపై గత కొద్దీ రోజుల క్రితం గుంటూరు అర్బన్ ఎస్పీకి బాధిత యువతి ఫిర్యాదు చేసిట్లుగా తెలుస్తుంది.
Also Read : Rapaka Varaprasad: సీఎం జగన్ దంపతుల ఫోటోలతో జనసేన ఎమ్మెల్యే కుమారుడి వెడ్డింగ్ కార్డ్
ఎస్ఐ రవితేజపై గుంటూరు అర్బన్ ఎస్పీకి కాంప్లైంట్ ఇచ్చిన తనకు న్యాయం జరగకపోవడంతో మహిళా సంఘాలతో కలిసి బాధిత యువతి నిరసనకు దిగింది. అయితే ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటామని బాధిత యువతి చెబుతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. తాను గట్టిగా అడిగితే ఎస్ఐ రవితేజ బెదిరింపులకు పాల్పాడుతున్నాడని యువతి పేర్కొంది.
Also Read : PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
ఆ తర్వాత నుంచి ఫోన్లో తరచూ మాట్లాడటం, ఇద్దరూ కలిసి తిరగడం, వీడియో కాల్స్ చేసుకుని గంటలకొద్దీ మాట్లాడుకోవడం చేశామని యువతి చెబుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రేమించాను అని చెప్పి మోసం చేశారని, తనకు ఎస్ఐ తో పెళ్లి జరిపించాలని యువతి కోరుతోంది. తాను ఎస్సీ నని, ఎస్ఐ బిసి అని, ఎస్ఐ తల్లిదండ్రులు కూడా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
Also Read : Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
ఆస్పత్రిలో పని చేసే తనకు ఆస్పత్రి వద్ద బందోబస్తు చేసే క్రమంలో ఎస్.ఐతో పరిచయం అయిందని యువతి చెప్తుంది. మీడియా వద్దకు వెళితే చంపేస్తానంటూ ఎస్ఐ రవితేజ బెదిరింపులకు పాల్పడుతున్నారని యువతి పేర్కొంది. తాను పోలీసునని తాను తలుచుకుంటే ఏమైనా చేస్తా అని బెదిరిస్తున్నాడని యువతి చెబుతోంది. 15 రోజులుగా ఎస్ఐ వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, తాను పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు తనను ఈ విధంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఎస్ఐ తనతో మాట్లాడిన వీడియోలు మీడియా ముందు ఉంచి తనకు న్యాయం చేయాలని బాధిత యువతి డిమాండ్ చేస్తుంది.