ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2019లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కొద్దీ రోజులకు రాపాక అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యాడు. సమయం వచ్చినప్పుడల్లా సీఎం జగన్ పై తనకున్న విధేయతను చాటుకుంటూనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నేతలకు మించి ఆయన జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే తాజాగా మరోసారి సీఎం జగన్ పై తన అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు. తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Also Read : Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
అయితే.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు, నాగరత్నం దంపతుల కొడుకు వివాహం జూన్ 7వ తారీఖు రాత్రి 1.02 గంటలకు జరుగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ పై సీఎం జగన్ దంపతుల ఫోటోలను అచ్చు వేయించాడు. మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి గార్ల ఆశీస్సులతో అంటూ పెళ్లి పత్రికలో ముద్రించారు.
Also Read : Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా… వైసీపీ అభిమానులు హర్సం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానులు మాత్రం రాపాక వరప్రసాదరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి భజన చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా.. ఉంటే.. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.