ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు.…
ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో…
ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ముందుగా ట్రైన్ కింద పడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:US-India: భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్…
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం సమీపంలోని ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది వారిని వెంటనే భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతిచెందాడు. యువతీ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన నడిపింటి రవి(35)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం…
ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్…
ఖమ్మం జిల్లాలోని తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. యువతి కోళ్లపూడి రమ్య ఇప్పటికే పెళ్లైన అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లాడు. పదిహేను రోజులపాటు అక్కడే గడిపారు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు వివాహితుడు నరేష్. యువతి ఎన్నిసార్లు ఫోన్ చేసిన నరేష్ స్పందించలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి వైజాగ్ లాడ్జిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.…
ఈ మధ్య వివాహేతర బంధాలు.. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు కొంత మంది భార్యామణులు. కొత్తగా పెళ్లైన వారైనా సరే.. ఏళ్ల తరబడి కాపురం చేస్తున్నవారైన సరే.. దీనికి మినహాయింపు లేకుండా పోయింది. కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించడం కన్నడనాట సంచలనం సృష్టించింది. లేటు వయసులో ఘాటు లవ్..…
వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.