Love Marriage: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది.
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.…
మహాత్మా గాంధీ పై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మూర్తి ని కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జీ పై సోషల్ మీడియాలో సినీ నటుడు చేసిన అనుచిత వాఖ్యల పై చర్యలు తెవాకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. సినీ నటుడు కొద్ది రోజులుగా గాంధీ జీ ని ఉద్దేశించి…
మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ పై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు, సేవాలాల్ బంజారా సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
Love : తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, తన మాజీ ప్రియుడు సురేష్ మోసపూరిత చర్యల కారణంగా పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో మోసపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య కొంతకాలంగా ప్రేమ కొనసాగింది. అయితే, వీరి ప్రేమకు పెద్దలు అడ్డుకట్ట వేశారు. చివరికి అక్షిత తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు.…
Ruchi Gujjar : హీరోను ఓ హీరోయిన్ అందరి ముందే చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో అయిన మాన్ సింగ్ ను హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన జులై 25న ముంబైలోనిసినీపోలిస్ థియేటర్‌కు వచ్చారు. అతను వస్తున్నట్టు ముందే తెలుసుకున్న రుచి గుజ్జర్…
Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది.
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల…