ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ కి లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గాకు అపవిత్రం కలుగుతుందని లేఖలో వివరించారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని లేఖలో ప్రస్తావించారు. లేఖలను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సి ఎస్, మైనారిటీ సంక్షేమ శాఖకి పంపించారు.
READ MORE: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ..
లావణ్య రాజ్ తరుణ్‌ల వివాదం ఆ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా మస్తాన్ సాయి ఉన్నాడు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మస్తాన్ సాయి నార్సింగి పోలీసుల కష్టడీలో ఉన్నాడు. కాగా.. గుంటూరు మస్తాన్‌దర్గాలో మస్తాన్ కుటుంబం ధర్మ కర్తలుగా కొనసాగుతున్నారు. ఈ నేరాలు చేసిన మస్తాన్‌ను ఈ బాధ్యత నుంచి తొలగించాలని.. కొనసాగితే.. భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు పేర్కొన్నారు.
READ MORE: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే.. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం