ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్‌తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు(నవంబర్ 15) అరకులోయలో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివస్, వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు.