Principal Slaps Teacher: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం పాఠశాలలో గణితం, సైన్స్ పాఠాలు బోధిస్తున్న రాజేంద్ర పర్మార్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ పర్మార్ పై అనుచిత ప్రవర్తన, దుర్భాషలాడడని ఆరోపించారు. అయితే, పర్మార్ ఈ దాడి గురించి మాట్లాడుతూ.. పాఠశాల సమావేశంలో కోపంతో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడని పేర్కొన్నారు.
Read Also: Chiranjeevi: లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు
ఈ సంఘటన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్వాతిబా రౌల్ దర్యాప్తును ప్రారంభించారు. ఇకపోతే, ఈ వివాదం మరింత కాస్తా తీవ్రంగా మారింది. దీనికి కారణం.. ఎందుకంటే ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని తెలుస్తోంది. పర్మార్ చెప్తున్నది ఏమిటంటే, ఠాకూర్ తన పాదాలకు మసాజ్ చేయించుకున్నాడని చెబుతున్నారు. మరోవైపు ఠాకూర్ ఆయనపై ఆరోపిస్తూ, పర్మార్ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించాడని పేర్కొన్నారు. దీనితో సమస్య ఎక్కడ మొదలైంది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ముందుముందు ఈ విషయంపై మరిన్ని వివరణలు వెలువడే ఉంటాయి.