బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ అందించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమరం భీం , సేవా లాల్ , ఏకలవ్య పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మైదాన ప్రాంతాల్లో సైతం ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత గిరిజనులకు అభివృద్ధికి ఫలాలు అందేలా చేస్తామని వెల్లడించారు.
Also Read:AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!
ఎస్టీల కోసం అదనపు ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. పూర్వీకుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా ఉద్యోగులకు సెలవులు ఇచ్చామన్నారు. అన్ని వర్గాలు వైశ్యామ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని వెల్లడించారు. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు పౌర గాడ్ పీఠాధిపతి బాబుసింగ్ మహరాజ్, ఎంపీ గోడం నగేష్ పలువురు ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ముఖ్య నాయకులకు సంత్ సేవాలాల్ జయంతి ఉస్సవ సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.