Leopard Dies: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలం కొలుకుల ఆటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందింది. కొలుకుల ఆటవీ ప్రాంతంలో కుందేళ్లను పట్టుకోవడానికి ఉచ్చులను ఏర్పాటు చేసిన వేటగాళ్ళు.. కుందేలు కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి మృతి చెందిన చిరుత పులి.. పులి మరణించడంపై ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో సంచలనంగా మారిన చిరుత పులి మృతి వ్యవహారం. చిరుత పులి ఉచ్చులో పడి ప్రమాదవ శాత్తు చనిపోయిందా… లేక ఉచ్చు బిగించి కావాలనే చిరుత పులిని చంపారా అనే కోణంలో అటవీ శాఖ అధికారుల విచారణ చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని వేటగాళ్లను ఆరా తీస్తున్నారు.
Read Also: Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు
అయితే, కొలుకుల అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతితో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీలో వేటగాళ్ల కదిలికలపై నజర్ పెట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, వేటగాళ్లు అటవీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు అనేక ఆంక్షలు విధించారు. జంతువులను వేటాడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు..