షడ్రుచులలో ఒకటి ఉప్పు . భారతీయ వంటకాలలో ఉప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్ధాలకు రుచిని ఇస్తుంది. అంతేకాదు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు తప్పనిసరిగా కావాల్సిందే. అయితే ఉప్పుని ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. ఉప్పు ఖరీదు పదుల్లో ఉంటుంది. కానీ.. ఈ ఉప్పు ఖరీదు మాత్రం రూ.20 నుంచి రూ.30 వేలు ఉంటుందట. ఇంతకీ ఈ ఉప్పు పేరేంటి? దాని ప్రత్యేక ఏంటి? అని సందేహ పడుతున్నారా? దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!
బాంబూ ఉప్పు చాలా స్పెషల్. దీన్నే పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుచుకుంటారు. ఇది కొరియన్ వంటకాల్లో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని కొరియన్లు అధికంగా వాడతారు. కొన్ని వందల ఏళ్ల నుంచి వారి సంప్రదాయ ఆహారంలో ఔషధాల తయారీలో వెదురు ఉప్పు భాగమైపోయింది. దీన్ని తయారు చేసే విధానం చాలా భిన్నంగా ఉంటంది. అందుకే మిగతా ఉప్పులతో పోలిస్తే దీనికి ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. కాగా.. ఈ ఉప్పును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఉప్పు తయారీపై ట్రయల్స్ జరుగుతున్నాయి. వెదురు బొంగులో తయారుచేస్తారు కాబట్టి దీన్ని బాంబూ సాల్ట్ అని పిలుస్తారు.
ఎలా తయారుచేస్తారు?
సముద్రపు నీరు నుంచి తయారుచేసిన ఉప్పుడును వెదురు బొంగుల్లో వేసి నింపుతారు. బొంగు రెండువైపులను బంకమన్నుతో మూసేస్తారు. ఆ బొంగులును మంటల్లో వేస్తారు. అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. వెదురు నుంచి వచ్చే నూనె, రసాలతో ఉప్పు కలిసిపోతుంది. వాటిలోని పోషకాలు కూడా ఉప్పుకు పడతాయి. దీని వల్ల ఉప్పు మరింత సుగుణాలు, పోషకాలతో నిండిపోతుంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల 14 గంటల పాటూ కాలుస్తారు. దీంతో వెదురు బొంగు బొగ్గులా కాలిపోతాయి. లోపలి ఉప్పు మాత్రం ముద్దలా తయారవుతుంది. దాన్ని తీసి శుభపరిచి మళ్లీ పొడిలా చేస్తారు. మళ్లీ దాన్ని వేరే వెదురుబొంగులో నింపి మళ్లీ కాలుస్తారు. ఇలా అనేక సార్లు చేయడం వల్ల ఉప్పు రంగు కూడా మారిపోయి బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. చివరికి గట్టి రాయిలా తయారవుతుంది ఉప్పు. దాన్ని పొడిలా చేసి ‘బాంబూ సాల్ట్’ పేరుతో అమ్ముతారు. దీని తయారు చేయడానికి దాదాపు 40 నుంచి 45 రోజులు పడుతుంది. అంతా మనుషులే స్వయంగా చేస్తారు. ఈ ఉప్పు తయారీలో ఎక్కడా మెషీన్లను ఉపయోగించరు.ఈ ఉప్పుకు చాలా డిమాండ్ ఉంటుంది.
దీని వల్ల ఉపయోగాలు ఏంటి?
పురాతన కాలం నుంచి కొరియన్లు వంటలలో, సాంప్రదాయ ఔషధంగా వెదురు ఉప్పును ఉపయోగిస్తున్నారు. వెదురు ఉప్పు వాపును తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఆర్థరైటిస్, గొంతు నొప్పి వంటి పరిస్థితులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సహా 70 కి పైగా ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఈ ఉప్పు నోటి పూత, వాచిన చిగుళ్ళతో సహా నోటి సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. శరీరంలో యాంటీఆక్సిడెంట్ కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది,. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదపడే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. వెదురు ఉప్పు హానికరమైన వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.