గ్రూప్-1 అభ్యర్థులు పరీక్ష తేదీలను మార్చాలని కోరుతూ నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిరసనల్లో పాల్గొన్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేగింది. అయితే.. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు అని, కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు కేటీఆర్. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కావాలనే ఆడుతున్న డ్రామా అని ఆయన విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ర్యాలీ చేయిస్తాడు రేవంత్ అని, మా నాయకులను అరెస్ట్ చేస్తారన్నారు. బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని, బండి సంజయ్ ఏం చదువుకున్నాడు ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది?? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Ranchi: సీఎం హేమంత్‌తో రాహుల్, ఖర్గే భేటీ.. ఎవరికెన్ని సీట్లంటే..!
అంతేకాకుండా..’పరీక్ష పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడు… అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు భరోసా ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక్క పంట కూడా రైతుబంధు ఇవ్వకుండా చేతులెత్తేశారు. కేసీఆర్ ముందే చెప్పారు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకే రైతు బంధు అని… ఇప్పుడు అదే జరుగుతుంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వనందుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. రైతులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని కోరుతున్నాను.’ అని కేటీఆర్ అన్నారు.