మెదక్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని తెలిపారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేయాలి.. నూటికి 90 శాతం రెడ్లు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు.. మైనంపల్లిని ప్రజా శాంతిపార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. మైనంపల్లి హన్మంత రావు తన కొడుకుతో వస్తే ఇద్దరిని గెలిపిస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ముక్త్ తెలంగాణ, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ.. బీజేపీ ముక్త్ తెలంగాణ కోరుకుంటున్నారు.. చంద్రబాబు, కేసీఆర్ లు మోడీకి తొత్తులు అంటూ కేఏ పాల్ విమర్శించారు.
Read Also: DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?
85 శాతం ప్రజలు కేఏపాల్ ను కోరుకుంటున్నారు.. నన్ను కలవడానికి ప్రధాని నరేంద్ర మోడీ రెండు ఏండ్లు వెయిట్ చేశారు అని పాల్ తెలిపాడు. మోడీకి ఇవి లాస్ట్ ఎన్నికలు.. కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ చూస్తోంది.. బీజేపీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఏం మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీకి బీ-పార్టీగా బీఆర్ఎస్, బీఆర్ఎస్ కు బీ-పార్టీ కాంగ్రెస్ ఉన్నాయని పాల్ అన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి కూడా బీఆర్ఎస్ లో చేరుతారు.. నియోజకవర్గానికి ఒక హెలికాఫ్టర్ పెడుతానంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నాకు అధికారం ఇచ్చేందుకు చూస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ప్రజల సమస్యలను పూర్తిగా తీర్చుతాను అని కేఏ పాల్ అన్నారు.
Read Also: AP Governor: ఏపీ గవర్నర్‌కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..