లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఎర్రగడ్డలో హరీశ్‌రావు ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బీహార్‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు.
బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా.. లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పదవి విరిచాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం బడ్జెట్‌ను తప్పుపట్టారు.
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ వెళ్లారు.
ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాలా తెలివిగా వ్యవహరిస్తు్న్నారని.. అందుకే బడ్జెట్‌ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఎద్దేవా చేశారు.
కులగణనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏన్టీవీతో మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలన్నారు. అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ కులగణనపై వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.