2023 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడి జనాలు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఈ వీడియోలో ఎంత నిజం ఉందో అనేది చెప్పడం కష్టం. కానీ ఈ వీడియోను చూసిన భారత్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pakistan Cricket: పాకిస్తాన్ బౌలింగ్ కోచ్లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ నియామకం
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లలో ఎంత నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. ఆసీస్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోకు సంబంధించి బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్శిటీలో జరిగినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో.. పెద్ద సంఖ్యలో జనాలు బిగ్ స్క్రీన్‌పై జరుగుతున్న మ్యాచ్‌ను వీక్షిస్తున్నట్లు చూడొచ్చు.
Read Also: Israel-Hamas War: హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్.. 24 గంటల్లో 250 టార్గెట్‌లపై బాంబుల వర్షం..
‘X’లో షేర్ చేసిన ఈ వీడియోను 60 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో కామెంట్‌లో ఒక వీడియో భాగస్వామ్యం చేశారు. అందులో భారత్ ఓటమిపై బంగ్లాదేశ్ ప్రజలు స్పందిస్తున్నారు. మరోవైపు టీమిండియా ఓటమి తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా మొత్తం జట్టు ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారిని ఓదార్చేందుకు తమ డ్రెసింగ్ రూమ్ లోకి ప్రధాని మోదీ వెళ్లి ధైర్యాన్ని నింపారు.
https://twitter.com/sh_akib_hq/status/1726473378352259427