ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించి బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధరణి వద్దు అన్న కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. మూడు గంటల కరెంట్ చాలు అన్న వాళ్ళని పొలిమెరలు దాటించాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. 10 hp మోటార్ అని రేవంత్ రెడ్డి చెబుతాడు ఎక్కడైనా ఆ మోటార్ ఉంటుందా అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Allu Sirish: మంచక్క కు ముద్దు.. తారక్ అన్నకు హగ్గు.. అదిరిందయ్యా శిరీష్
ప్రతిపక్షాలు విమర్శించదానికీ ఎం లేక బూతులు మాట్లాడుతున్నాయని, మనకి బూతులు కావాలా..భవిష్యత్ అందించే నాయకులు కావాలా అని ఆయన అన్నారు. రైతుల్ని బిచ్చగాళ్లు అని రేవంత్ రెడ్డి హేళన చేస్తున్నారని, రుణమాఫీ కోసం ఎన్నికల కమిషన్ లేఖ రాశామన్నారు. ఒకవేళ అనుమతిస్తే వారం లోపు మొత్తం రుణమాఫీ చేస్తామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… వచ్చే జనవరి నుంచే అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగిస్తామన్నారు. దీంతో అవి పట్టా భూములుగా మారతాయని హరీష్ రావు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేశారన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే రుణమాఫీ డబ్బులు అకౌంట్లలో వేస్తామని.. లేదంటే డిసెంబర్ 3 తర్వాత జమ చేస్తామన్నారు.
Also Read : India Vs New Zealand: ఆకాశంలో విమానం.. లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించిన ఇండిగో పైలెట్.. ట్వీట్ వైరల్..