రామంతపూర్ స్ట్రీట్ నెంబర్ 8లో లిక్కర్ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్న ఘటన చోటు చేసుకుంది. కరెంట్ వైర్లు కిందికి ఉండటం వల్ల డీసీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం జరిగింది.
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో…
Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక…
Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ఈ సందర్భంగా ఫైర్ డీఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ.. మాకు ఫోన్ కాల్ వచ్చిన ఒకటిన్నర నిమిషంలో సంఘటన స్థలానికి చేరుకున్నాం.. ఫైర్ ఇంజన్లో పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఉన్నాయి.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ…
Gulzar House : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.…
Fire Accident : సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు , స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన…
Fire Safety Week: తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలో ఉన్న అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రంలో ముఖ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమరవీరుల స్తూపం…