Manchu Manoj : మంచు మనోజ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అన్న మంచు విష్ణుకు కౌంటర్ వేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఇలాగే రెచ్చిపోయాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ మీద. నిన్న రాత్రి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో మనోజ్ మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రోజుల్లో తన కుటుంబమే తనను పరాయి వాడిగా చూస్తుంటే అభిమానులు మాత్రం సొంత మనిషిలా చూడటం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
Read Also : TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..
‘శివయ్యా అంటే శివుడు రాడు. శివుడు ఎప్పుడైనా మనకు మనుషుల రూపంలోనే వస్తాడు. ఇలాంటి అభిమానుల రూపంలో, అలాంటి దర్శకుల రూపంలో వస్తాడు’ అంటూ చెప్పాడు. ఇది వినడానికి ఏదో కామన్ గానే అనిపించినా.. మంచు విష్ణుకు కౌంటర్ వేసినట్టే ఉందని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ‘శివయ్యా’ అనే డైలాగ్ ఉంది. దాన్ని టీజర్ లో కూడా చూపించారు. ఆ డైలాగ్ ను దృష్టిలో పెట్టుకుని మనోజ్ ఈ కామెంట్లు చేశారేమో అంటున్నారు.
ఇదే కాకుండా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు మనోజ్. ‘నన్ను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో పంపించేశారు. నా పిల్లల బట్టలు కూడా బయట పెట్టేశారు. కా కార్లు లాగేసుకున్నారు. అలాంటి టైమ్ లో నా ఫ్యాన్స్ అందరూ వచ్చినాకు అండగా నిలిచారు. నాకు కార్లు తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఎప్పుడూ ధర్మం వైపు మాత్రమే ఉన్నాను. అందుకే నాకు ఇంత మంది సపోర్ట్ లభిస్తోంది. నేను ఈ జన్మలో కట్టె కాలేంత వరకు మోహన్ బాబు గారి అబ్బాయినే. దాన్ని ఎవరూ మార్చలేరు.
ఆయన నాకు చిన్నప్పటి నుంచి క్రమ శిక్షణ నేర్పించారు. నీతి వైపు నిలబడమంటూ చెప్పారు. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పటి వరకు అదే నన్ను నడిపిస్తోంది’ అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్లు చేశారు.
Read Also : Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..