అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఎగువ వాయు తుఫాను కొనసాగుతుందని పేర్కొంది. మే 21 నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే ఛాన్సుంది. దీని కారణంగా మే 20 నుంచి పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 23 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!
మే 22 వరకు కర్ణాటక, బెంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఇక రుతుపవనాలు కూడా ఈ ఏడాది త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ 15 కంటే ముందే వచ్చే ఛాన్సుంది. కేరళలో నైరుతి రుతుపవనాలు కారణంగా భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మే 24 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు నారింజ హెచ్చరిక జారీ చేశారు.
ఇది కూడా చదవండి: CISF: స్పోర్ట్స్ బాగా ఆడతారా? హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే ఛాన్స్.. 403 ఉద్యోగాలు రెడీ.. రూ. 81 వేల జీతం