మన దేశం అన్ని మతాలు, సంస్కృతులు కలసి సహజీవనం చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద శనివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Parineetichopra : తల్లి అయిన స్టార్ హీరోయిన్.. మహేశ్ బాబు హీరోయిన్ ఖుషీ సీఎం…
Hyd Metro: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టొ్ద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Gulzar House : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.…
CM Revanth Reddy: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలని సూచించారు. UP: పెళ్లైన ఆరు…
Fire Accident : నగరంలోని మీర్‌చౌక్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్‌చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు…
లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
Miss World 2025: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రపంచ సుందరీమణులు నేడు (మే 13) నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు నగరంలోని చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద ‘హెరిటేజ్ వాక్’లో పాల్గొననున్నారు. Read Also: WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ…
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడటంతో జన…
GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది…