Gulzar House : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.…