పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు. సీట్లు మార్పులు చేర్పులు చేసినపుడు సీటు కోల్పోయిన వారు బాధపడటం సహజం.. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నాను అని ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడించారు.
Read Also: Fighter: 4 రోజుల హాలిడేస్… హిస్టరీ క్రియేట్ చేయడానికి హ్రితిక్ రెడీ
ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పాను అని ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఇప్పటికైతే పోటీ చేయడం లేదు.. భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిస్తాను.. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అనేది పార్టీ అధినేత సర్వేల బట్టి చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ భారీ మెజారిటీతో గెలుస్తారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Hanuman for Sreeram: 2,66, 41,055… ఇది హనుమంతుడి నుంచి అయోధ్యకి వెళ్లింది
ఇక, ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో ఒక మంచి దారి వేశారు.. సీఎం జగన్ యువతకు రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. జగన్ ఆదేశించారు కాబట్టే నేను పోటీకి ఒప్పుకున్నాను.. అందరినీ ఓకే కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడంపై ప్రతి పక్షాలు చేస్తున్న హంగామా హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏలూరు పార్లమెంట్లో ఉండే సమస్యలు నాకు కొత్తేం కాదు.. విద్యా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అని కారుమూరి సునీల్ చెప్పుకొచ్చారు.