కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు.
కోటగిరి శ్రీధర్. ఏలూరు వైసీపీ ఎంపీ. సీనియర్ పొలిటీషియన్ కోటగిరి విద్యాధరరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్.. తండ్రి స్థాయిలో ప్రభావం చూపడం లేదన్నది అనుచరుల మాట. 2019లో ఎంపీగా గెలిచాక.. నియోజకవర్గ పరిధిలోనే నల్లపూస అయిపోయారు. అప్పుడప్పుడూ వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడమే తప్ప.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి. అలాంటి శ్రీధర్.. కొత్త కొత్త కామెంట్స్‌తో చర్చల్లో వ్యక్తిగా మారిపోయారు. కీలక అంశాలనే టచ్ చేస్తూ.. కొత్త ప్రశ్నలకు…