ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు.
పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు.
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నన్ను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి నిత్యం జనంలో ఉన్నా.. పెత్తందార్ల మాట కోసం నన్ను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఏం జరుగుతుందో పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంలేదన్నారు. చింతలపూడిలో పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరిగింది.. కానీ, పార్టీ అధినేత జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారని కామెంట్ చేశారు.
Eliza and Kambala Jogulu: అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనతో టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. వైసీపీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా.. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల ఘర్షణపై స్పందించిన ఆయన.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు డైరక్షన్ లోనే సభలో గలాటా చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని.. నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపైనా దాడి చేశారని.. సుధాకర్…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. కామవరపుకోట మండలం ఆడమిల్లి సమీపంలో ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది.. అయితే, ప్రమాద సమయంలో వెంటనే బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.. పెను ప్రమాదం తప్పడంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే ఎలీజా అభిమానులు, కుటుంబ సభ్యులు…