మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్‌లో దీపిక 6-2తో నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌ను ఓడించింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్‌లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా.. భారత ఆటగాళ్లు కొందరు సత్తా చాటుతుంటే.. మరికొందరు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మరి కొందరు ఆటగాళ్లు సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఒలింపిక్స్ రౌండప్ ఎలా ఉందో తెలుసుకుందాం.
పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత ఆటగాడు పతకం సాధించడంలో దగ్గర్లో ఉన్నారు. 50 మీటర్ రైఫిల్ 3 పాజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.