Sitaram Yechury: పదేళ్ళలో ఏపీకి ఏమీ జరగలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలోని యం.బి స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంపై రాజ్యసభలో చాలా చర్చలు జరిగాయని.. ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారు అని తెలిపారు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ఐదేళ్ళు ప్రత్యేక హోదా.. రాజ్యసభలోనే అప్పుడు వెంకయ్య నాయుడు పదేళ్ళ ప్రత్యేక హోదా అన్నారని.. ఆ హామీలు అన్నీ ఏమైపోయాయన్నారు. ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పిందని ఆయన మండిపడ్డారు.
Also Read: Minister Venugopalakrishna: గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే యోజన, 24వేల కోట్లు ఇస్తాను అని ప్రధాని చేసే హామీలు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టుకు వ్యతిరేకమని ఈ సందర్భంగా చెప్పారు. తప్పుడు చేతుల్లో అమృతం చేరింది.. దాన్ని ప్రజల కోసం తీసుకురావాలన్నారు. దేశ ప్రజల ఐక్యతకు పెద్ద ప్రమాదం వచ్చిందన్నారు. ఎమర్జెన్సీ కంటే పెద్ద ఎత్తున దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.
Also Read: CM YS Jagan: మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..
స్థానిక పార్టీలకు ఈడీ, సీబీఐ అంటే భయమా.. మోదీ అంటే రుచి ఉందా మీకు అని ఆయన అన్నారు. 49 హింసాత్మక సంఘటనలు మహిళలపై ప్రతీరోజూ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. గిరిజన భూములలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. పాలస్తీనా వారికి వారి దేశాలను ఇవ్వాల్సి ఉండాలన్నారు. అమెరికా జూనియర్ పార్టనర్‌గా ఇండియాను మోడీ తయారు చేశారన్నారు. గవర్నర్‌లు శాసనసభల చట్టాలు తప్పు అనడం సరైనది కాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తమిళనాడు గవర్నర్ శంకరయ్యకు గౌరవ డిగ్రీ ఇవ్వడానికి ఫైలు పెట్టుకు కూచున్నాడు.. ఆ శంకరయ్య ఇవాళ మరణించారన్నారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారా మోడీని గద్దె దింపాలన్నారు. ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీ నుంచీ బయటపడాలంటే మోడీని గద్దె దించాలన్న ఆయన.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి ఆమెను ఓడించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మరల తెచ్చారన్నారు. HDI, GDP లలో G20దేశాలలో ఇండియా అందరికంటే కింద ఉందని సీతారాం ఏచూరి పేర్కొ్న్నారు.