CM YS Jagan: మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి అంటూ పిలుపునిచ్చారు.. పొత్తులను నమ్ముకోలేదు.. నా ధైర్యం మీరే అన్నారు.. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ప్రకటించారు.. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు.. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం.. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని పేర్కొన్నారు.
పల్నాడులో తాగు, సాగు నీటి ఏడ్డడి ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. కృష్ణమ్మ పక్కనే ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదు అన్నారు సీఎం జగన్.. పల్నాడు తల రాత మార్చాలని చేస్తున్న ప్రయత్నమే వరికిపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎన్నికలు కు ఒక నెల ముందు టెంకాయ కొట్టారు.. ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందని నిస్సిగ్గుగా పల్నాడు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.. వైల్డ్ లైఫ్ , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఈ ప్రభుత్వం లో వచ్చాయి.. ఏ అనుమతులు లేకుండా చంద్రబాబు ఎలా ప్రారంభం చేశారు..? అని నిలదీశారు.. చిత్త శుద్ది, నిజాయితీ లేకుండా ప్రజలను మోసం చేసిన నాయకుడు చంద్రబాబు.. అందుకే 2019 లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.. కేవలం 23 స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాల సాగు, వేలాది మందికి తాగు నీరు అందిస్తాం.. దశల వారీగా మాచర్ల, వినుకొండ, ఎర్ర గొండ పాలెం ప్రాంతాలకు నీరు అందిస్తాం అన్నారు. లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది.. లక్ష మందికి తాగు నీరు అందిస్తాం.. పౌరుషాల గడ్డను అభివృద్ధికి అడ్డాగా మార్చాం.. పల్నాడును ప్రత్యేక జిల్లా చేశాం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
సామాజిక ఆర్థిక, విద్యా వ్యవస్థల అభివృద్ధికి పని చేస్తున్నాం.. లంచాలు, వివక్ష లేకుండా రెండు లక్షల నలభై వేల కోట్లు ప్రజల అకౌంట్ లలో వేశామని తెలిపారు సీఎం జగన్.. రెండు సంవత్సరాలు వరుసగా కోవిడ్ దాడి చేసినా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేదన్న ఆయన.. గతం లో చంద్రబాబు పాలన లో మోసాలు, వెన్నుపోటు, అసత్యాలు కనిపించే పరిస్థితి.. పద్నాలుగేళ్ళ సీఎం ఒక్క మంచి పని చేశానని ఓటు అడగ లేడు.. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు. మీ బిడ్డగా అడుగుతున్నా మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి.. చంద్రబాబు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఓటు అడుగుతున్నాడు.. అవసరం అయితే కేజీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తానంతాడు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సొంత నియోజకర్గం కుప్పంలో తాగు నీరు ఇవ్వలేని చంద్రబాబు, మన పల్నాడు కు మంచి చేస్తాడా? అని నిలదీశారు జగన్.. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కు బంగారు గాజులు చేపిస్తా అన్నట్లు ఉంది చంద్రబాబు ప్రచారమన్న ఆయన.. కుప్పంకు నీళ్లు కావాలన్న, రెవెన్యూ డివిజన్ కావాలన్న చేసింది మీ బిడ్డ జగనేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేను లేస్తే మనిషిని కాను అనే రకం.. ఇప్పుడు ఏం చేస్తానో చెప్పడు, యాభై ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తాడు.. ప్రజల చేవిలో ఫ్లవర్ పెడతాడు.. పల్నాడులో గాని ఏ జిల్లా లో గాని అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. పిల్లను ఇచ్చిన మామకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల కు వెన్ను పోటు పొడవడం లెక్క కాదన్న ఆయన.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాల అంటాడు, బీసీల తోకలు కట్టిరిస్తా అని అహంకార మాటలు చంద్రబాబువి అని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మంచి చేసిన పేద కుటుంబాలు ఎవరు చెప్పాలి.. తన కొడుకు, తన మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటారు.. పేద కుటుంబాల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటారని దుయ్యబట్టారు.
ఇలాంటి చంద్రబాబు హయాం లో ఏ పేద కుటుంబానికి, ఏ వెనుక బడిన వర్గాలకు మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి.. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని తెలిపారు సీఎం జగన్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే రెండు లక్షల ఏడు వేలు ఉద్యోగాలు ఇచ్చాం.. చంద్రబాబు కు మళ్ళీ అధికారం ఇచ్చి ఉంటే ఆర్టీసీ , పవర్ డిస్కం లు అమ్మేసేవాడు.. చంద్రబాబు హయాంలో వైద్య రంగం కుదేలు అయిపోయింది.. రైతులకు ఉచిత విద్యుత్ అడిగితే ఆ రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబు ది.. రైతులను మోసం చేసి గాలికి వడిలిన చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తాడట.. అధికారం లోకి రావాలని కల్ల బొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. నరమాంసం అలవాటు పడిన పులి బంగారు గాజులు ఎర వేస్తున్నాడు.. నమ్మి వెళ్తే అంతే సంగతులు అని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!