నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ని కలెక్టర్ ఛాంబర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చక్కటి సమీకృత భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. విసిరేసినట్లు అక్కడ ఇక్కడ ఉన్న పూర్వ ఆదిలాబాద్ ను 4 జిల్లాలుగా చేసుకున్నట్లు, 4 జిల్లాల్లో 4 వైద్య కళాశాలలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిపారు. చాలా వెనుకబడ్డ ఆసిఫాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే 50 సంవత్సరాలయిన ఆసిఫాబాద్ లో మెడికల్ కళాశాల వచ్చి వుండేదికాదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతంగా ముందుకు వెళుతుందన్నారు. త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎంతో ప్రగతి సాధించామన్నారు.
SxX Championship : జూన్ 8నుంచి శృంగార పోటీలు… ఎక్కడో తెలుసా ?
పర్ క్యాప్ట ఆదాయం, పర్ క్యాప్ట విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ లో ఉన్నామన్నారు. ఎక్కడో ఉన్న మనం బ్రహ్మాండంగా పురోగమించి, ముందు వరుసలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర లకు అందనంత ఎత్తుకు చేరామన్నారు. ఇదే అభివృద్ధికి సూచి అని ఆయన తెలిపారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, సమాజంలో చాలా పేదరికం లో ఉన్నవారు ఉన్నారని, వెనుకబడిన జాతుల్లో పేదరికంలో ఉన్నవారు, అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారని, అందరిని సమాన స్థాయిలో తేవాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లు చేపడతామని ఆయన తెలిపారు. పటిష్టంగా ఉన్న పునాదికి భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడతామన్నారు. పోడు భూముల పట్టా పంపిణీ ఈ నెల 24 నుండి చేపట్టాలని, ఈ సీజన్ నుండే పోడు భూముల పట్టాదార్లకు రైతుబంధు వర్తింపజేయాలని, ఈ దిశగా వారినుండి బ్యాంకు ఖాతా తదితర వివరాలు సేకరించాలని అన్నారు. మానవీయ కోణంలో పథకాల అమలు చేస్తున్నట్లు, ఒంటరిమహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు అందజేరిస్తున్నట్లు, రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా రూపుదిద్దుకున్నట్లు, ఇదే చర్చ సర్వత్రా జరుగుతున్నట్లు ఆయన అన్నారు.
Virender Sehwag: మనసున్నోడు మా వీరు.. రైలు ప్రమాదంలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, 15 ఎకరాల సువిశాల స్థలంలో, 56.20 కోట్ల వ్యయంతో, ఒక లక్షా 40 వేల చదరపు అడవుల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ నిర్మాణం జరిగినట్లు తెలిపారు. అన్ని శాఖల కార్యకలాపాలు ఇక్కడి నుండే జరుగనున్నట్లు ఆమె అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా 1999 లో పనిచేసినట్లు, అప్పటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని, క్యాంపులకు వెళ్ళడానికి కష్టంగా ఉండేదని, పోలీసుల భద్రత లేనిది వెళ్లలేక పోయేవారమని అన్నారు. శాంతి భద్రతల సమస్యల, త్రాగునీటికి వాగుల్లో బిందెలు పట్టుకొని క్యూలో నిలబడే వారని, అతిసారం, మలేరియా, ఎండదెబ్బ మరణాలు సంభవించేవాని, కలెక్టర్ తో సహా అందరూ ఓఆర్ఎస్, మందులు వెంటబెట్టుకొని వెళ్ళేవారమని ఆమె అన్నారు. ఈ రోజు ఇక్కడ చూస్తుంటే సంతోషంగా ఉందని, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో అభివృద్ధి చెందామని అన్నారు. రాష్ట్రం సిద్దించాక 2014 లో ఉద్యోగస్తులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లు, రెండు వేతన సవరణలు చేపట్టి, 43, 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, అవుట్ సోర్సింగ్ తదితర 10 లక్షల మందికి లబ్ది చేకూర్చినట్లు తెలిపారు. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచినట్లు, 2 నుండి 3 గ్రామాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటుచేసి, ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించినట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ని నియమించి, ఉద్యోగుల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ ఫలాలు అర్హులకు సులభంగా చేరే విధంగా 33 జిల్లాలను ఏర్పాటుచేసుకున్నట్లు, 18 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు పూర్తి చేసుకున్నట్లు, క్రొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందనున్నట్లు తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి పథకాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు సీఎస్ అన్నారు. అర్హులైన ప్రజలకు పథకాలు చేరువలో తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.