శృంగారం అంటే ఒకప్పుడు పెళ్లి తర్వాతే.. అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్ని కానిస్తున్నారు.. ఇక కొన్ని దేశాల్లో వాటిమీద క్రీడలు కూడా పెడుతున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. శృంగారం పోటీలు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.. ఏంటి నాలుగు గోడలు మధ్య జరగాల్సిందాన్ని నలుగురిలో ఎలా చేస్తారు అనే డౌట్ మనకు వస్తుంది.. కానీ వేరే దేశాల్లో మాత్రం అలాంటి సిగ్గులు లేవనే చెప్పాలి..
ఇక విషయానికొస్తే.. శృంగారాన్ని స్వీడన్ దేశం క్రీడగా గుర్తించింది. అంతే కాదు జూన్ 8 నుంచి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ పేరుతో పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ఛాంపియన్‌షిప్ ఆరు వారాల పాటు జరగనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో నమోదు చేసుకున్న పార్టిసిపెంట్స్ రోజుకు 6 గంటలపాటు పాల్గొనాల్సి ఉంటుంది.. అయితే ఈ టోర్నమెంట్‌లో యూరోపియన్ దేశాలకు చెందినవారు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపింది.
మొత్తం 16 ఛాలెంజింగ్ రౌండ్లతో ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు ఈ అసోసియేషన్ ఛైర్మన్ డ్రాగన్ బాటిచ్ వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు యూరోప్‌లోని వివిధ దేశాలకు చెందిన 20 మంది పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.. మామూలు అన్ని పోటీలకు ఉన్నట్లు ఈ పోటీలకు కూడా జడ్జీలు ఉంటారు.. ఏది ఏమైనా కూడా ఈ పోటీలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఇలాంటి పోటీలు కూడా ఉంటాయా అని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు.. మరి ఈ పోటీలు ఎలా ఉంటాయో చూద్దాం..