ఏపీలో శాంతిభద్రతల పరిస్ధితులు, హోంశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలన్నారు.
నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలన్నారు. ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ వుండాలన్నారు. డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండకూడదని ఆదేశాలిచ్చారు. అవినీతి మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో పెకలించేయండి. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించండి. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Budda Venkanna: ఆ మంత్రివల్లే సూసైడ్ బ్యాచ్ ఏర్పాటు