బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
ప్రధాని మోడీ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా అమిత్ షా కూడా సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు.
రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి స్పందించారు.
మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నా... కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా చిట్‌చాట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే.. సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు..
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఏపీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు.
Vangalapudi Anitha: విజయనగరం జిల్లాలో నకలీ ఐపీఎస్ అధికారి గురించి ఎన్‌టీవీలో ప్రసారమైన వార్తలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ వార్తపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించారు. అలాగే, వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మన్యం పర్యటనలో భద్రతా లోపం గుర్తించడంతో.. ఈ విషయం గురించి హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన బలివాడ…
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.