ఏపీలో శాంతిభద్రతల పరిస్ధితులు, హోంశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలన్నారు. నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలన్నారు. ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ…
ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత…