Viral Video: పెళ్లి అనేది జీవితంలో ఓ పెద్ద పండుగ. అందుకే ఎవరైనా పెళ్లి గురించి కలలు కంటుంటారు. ఆ వేడుకును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. ప్రస్తుతం సర్‌ప్రైజ్‌లు, సరదాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ముక్క చుక్క లేకుండా అసలు పెళ్లిళ్లే జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లి వేడకలో ఫన్నీ మూమెంట్స్, షాకింగ్, ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ప్రత్యమవుతూనే ఉన్నాయి. ఓ వరుడికి సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వధువు ఇంటికి స్పెషల్గా ఎంట్రీ అవ్వాలని ప్లాన్ చేశాడు వరుడు.
Read Also: TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
తన స్పెషల్ ఎంట్రీతో వధువును సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు.. కానీ వరుడి ఆశలు తలకిందులయ్యాయి. అందంగా ముస్తాబైన వరుడు గుర్రంపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో బంధువులు టపాసులు పేల్చారు. బాంబులు పేలిన సౌండ్‌కు ఒక్కసారిగా బెదిరిన గుర్రం అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. దీంతో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి దాని యజమాని వెనకాలే పరుగులు పెట్టాడు. అయితే గుర్రంపై కూర్చున్న వరుడు కూడా అటే వెళ్లడంతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు గానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ మంది వీక్షించారు.