Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యంలో రామమందిరాన్ని నిర్మించారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు.
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని…
ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2020-ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అనేక శతాబ్దాలుగా శత్రువుల దాడిని ఎదుర్కొన్న భారతదేశానికి "నిజమైన స్వాతంత్ర్యం" మాత్రం అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన తర్వాతే వచ్చిందన్నారు.
Ayodhya: అయోధ్య రామమందిర దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానస్పదంగా ప్రవర్తించాడు. అతడు ధరించిన కళ్లద్దాల్లో కెమెరాను దాచి ఉంచాడు. ఈ గ్లాసెస్ ధరించి కాంప్లెక్స్‌ని వీడియో, ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలను ఉల్లంఘించినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుజరాత్ వడోదరకు చెందిన జయకుమార్గా పోలీసులు గుర్తించారు.
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.