రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్‌చార్జ్ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Breaking: మరో 3 రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు..
తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ వివరించారు. ఇటీవలి నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో భారతదేశంలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Harish Rao : కేసీఆర్ వల్లే రాష్ట్రంలో పేదరికం తగ్గింది
కాగా.. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రానికి వచ్చినప్పుడు తనకు లభించిన స్వాగతాన్ని కూడా ప్రస్తావించారు. కేరళ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతకు తాను పొంగిపోయానని అన్నారు. మంగళవారం కొచ్చి చేరుకుని ఈ ఉదయం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయానికి వెళ్తుండగా ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లారు.