ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫేవరేట్స్ లో ఒక జట్టుగా బరిలోకి దిగిన పాకిస్తాన్ తగినంత రీతిలో రాణించకపోవడంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ అనంతరం బాబర్ అజామ్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని కొన్ని మీడియా కథనాలలో పేర్కొంది.
Read Also: Bread: బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తింటున్నారా.. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్లో ఏది మంచిది..?
బాబర్ కెప్టెన్సీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బాబర్ ఆజమ్ కు భారీ షాక్ ఇచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రపంచకప్ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవి ఊడనున్నట్లు సమాచారం. ఈ వరల్డ్ కప్ లో బాబర్ కెప్టెన్సీపై పీసీబీ సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ కూడా కెప్టెన్సీ పరంగా రెండు భాగాలుగా విభజించబడింది. ఒక భాగం బాబర్‌ను కోరుకుంటుండగా.. మరొకటి షాహీన్ షా ఆఫ్రిదిని కోరుకుంటుంది.
Read Also: ISIS: తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్ఐఏ వెల్లడి..
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ తర్వాత బాబర్ ఆజం కేవలం ఒక ప్లేయర్ గా మాత్రమే కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన వల్ల కొందరి ఆటగాళ్లపై వేటు పడనుంది. పాకిస్తాన్ వార్తా ఛానెల్ జియో సూపర్ నివేదిక ప్రకారం.. ప్రపంచ కప్ తర్వాత బాబర్ అజామ్ వన్డే, టీ 20 ఫార్మాట్‌ల కెప్టెన్సీ నుండి తప్పుకోవచ్చు. అయితే.. దీనికి సంబంధించి బాబర్ లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఇంకా అధికారిక సమాచారం లేదు.