ఐపీఎల్ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన లీగ్ ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్. 14 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ లీగ్ 15వ సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ లీగ్ లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ తో ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. సిడ్నీ సిక్సర్స్ బాబర్ తో డీల్ సెట్ చేసింది. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ…
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్…
Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రటించుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ప్రయేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌పై భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కి భారత్ వరస షాక్‌లు ఇస్తోంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ని భారత్ రద్దు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. భారత్‌లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానెళ్లను ఇండియా బ్లాక్ చేస్తోంది.
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. టీ20ల్లో 50+ స్కోర్లను అత్యధిక సార్లు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ హాఫ్ సెంచరీ (70; 42 బంతుల్లో 8×4, 2×6) చేయడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఇప్పటివరకు కోహ్లీ 50+ స్కోర్లను…
టీ20లలో న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. వన్డేలలో కూడా అదే అలవాటుగా మారింది. తాజాగా కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపియర్‌లోని మెక్లీన్ పార్క్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 22 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ డుమ్మా కొట్టాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో అతడిపై…
కరాచీలో బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 అర్ధ సెంచరీలు సాధించిన రెండవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. బాబర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2015 మే 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 29 హాఫ్ సెంచరీలు, 127 వన్డేల్లో 35 హాఫ్ సెంచరీలు, 128 టీ20ల్లో 36 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సంచలనం నమోదయ్యింది. టీమిండియా యంగ్ ఆటగాడు తిలక్ వర్మ తన కెరియర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా తిలక్ వర్మ ఈ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఏకంగా 720 స్థానలు ఎగబాకి టి20 లలో రెండో స్థానంను దక్కించుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్…