ISIS: తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్ఐఏ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది. దేశంలో ఉగ్రవాదాన్ని, హింసను పెంచాలని వారంతా భావించినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నిందితులంతా బాగా చదువుకున్నవారే అని.. వీరిలో సాంకేతికత గురించి తెలిసిన వారున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పూణేలో అనేక సమావేశాలు నిర్వహించడంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉగ్రవాదం కోసం సభ్యులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు చార్జిషీట్ పేర్కొంది.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఐఈడీ కోసం రసాయనాలు కొనుగోలు చేయడానిక సల్ఫ్యూరిక్ ఆసిడ్, అసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం వెనిగర్, రోజ్ వాటర్, షెర్బాత్ వంటి కోడ్ పేర్లను ఉపయోగించారు. నిందితులు ఇండియాలో ఐఎస్ఐఎస్ భావజాలాన్ని పెంచాలని అనుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘‘రివేంజ్ ఆన్ కాఫిర్స్’’ అనే క్యాప్షన్‌తో ప్రచారాన్ని ప్రారంభించారు. వీటికి సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కాఫీర్లు(ముస్లింయేతరులు) పగతీర్చుకోవాలని నిందితులు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. నిందితులంతా విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు దాడులకు సంబంధించిన ప్లాన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టచ్ లో ఉన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!