ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బెడ్ మీద నుంచి లేవగానే.. ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఫాస్ట్‌గా బ్రష్ చేసి.. టీ, కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని.. టైమ్ లేదని టిఫిన్ తినడం మానేసి ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఉదయం మనం లేవగానే చేసే పనుల ప్రభావం.. ఆ రోజంతా ఉంటుంది. మన రోజు చికాకుగా మొదలు పెడితే.. ఆరోజంతా విసుగ్గానే ఉంటుంది. ప్రతి రోజూ ఇలాగే అలవాడు పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే మనం చేసే చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే.. మీరోజు ఆనందంగా గడుస్తుంది. కొన్ని చెడు అలవాట్లు కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఉదయాన్నే లేవగానే కొన్ని తప్పులు చేయొద్దు.. ఇంతకీ అవెంటంటే…..
మొబైల్ ఫోన్ ఉపయోగించొద్దు
ఉదయాన్నే కళ్లు తెరవకముందే ఫోన్ చూడటం చాలా మందికి అలవాటు. మంచం పక్కనే ఫోన్ పెట్టుకుని పడుకోవడం, ఉదయం నిద్రలేచిన వెంటనే దాన్ని చెక్ చేయడం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా.. అలసట, తలలో భారాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు
పొద్దున లేచిన తర్వాత ఎప్పుడైనా చిరాకుగానూ, బాధగానూ అనిపిస్తే.. ఆరోజు సరిగ్గా ఏం చేయలేం. ఏ పనీ సక్రమంగా జరగదు. అటువంటి పరిస్థితిలో.. ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి రానించకూడదు.
వ్యాయామం చేయండి
చాలామంది ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామానికి దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో.. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాయామం చేయని వ్యక్తులు ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఖాళీ కడుపుతో ఉండండి
చాలా మంది ఉదయం లేవగానే త్వరగా తయారై ఆఫీసుకు గానీ, పనులకు గానీ వెళ్లిపోతారు. అలా కాకుండా.. ఉదయం లేవగానే ముఖం కడుక్కుని అల్పాహారం చేసి బయటకు వెళ్తే మంచిది.
ప్రణాళికతో పని చేయండి
ఎటువంటి ప్రణాళిక లేకుండా రోజును ప్రారంభించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఒత్తిడి, ఆందోళన, విశ్రాంతి లేకుండా ఉంటారు. వారు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. రక్తపోటు వంటి వ్యాధులు కూడా రావచ్చు.