Karumuri Nageswara Rao: చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన హయాంలో రైతులు అల్లాడనిపోయారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. దళారులకు డబ్బు పోకుండా అది కూడా రైతులకే అందేలా చర్యలు చేపట్టామన్నారు. గన్నీ బ్యాగ్స్ కూడా మేమే ఇస్తున్నామన్నారు. జగన్ చేసిన మేలు చంద్రబాబుకు కనపడదని.. సీఎం జగన్ రైతుల గుండెల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సీఎం అయితే కరువు కాటకాలేనని ఆయన విమర్శించారు.
జగన్ సీఎం ఐతే నదులు పుష్కలంగా ప్రవహించడంతో పాటు పంటలు బాగా పండుతాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎమ్మెస్పీ ధర అధికంగా ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకుని రామోజీరావు వార్తలు రాయాలన్నారు. ఇరవై రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నామన్నారు. బీసీలకు కోటి 76 లక్షల కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. నలుగురిని రాజ్యసభకి జగన్ పంపారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరి నైనా ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఎవరికి ఉందో అర్థం కావటం లేదా అని ప్రశ్నించారు.
Dasari Kiran Kumar: జగన్ కీలక నిర్ణయం.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దాసరి కిరణ్..
కుప్పంలోనే చంద్రబాబుకు సీన్ లేదని తేలిపోయిందని.. బీసీలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. లోకేష్ ఏం చేశాడని పాదయాత్ర చేస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నారని.. మరి లోకేష్ తన తండ్రి హయాంలో ఏం చేశారని చెప్తారన్నారు. ఒక్క పథకమైనా చెప్పుకునేది ఉందా అంటూ మండిపడ్డారు. అన్ని కులాలూ జగన్‌ని కావాలని అంటున్నాయన్నారు. బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆయన.. తాము ఏం చేశామో విడుదల చేస్తామని సవాల్ విసిరారు. రైతుల నుంచి తడిసిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎస్‌కు లేఖ రాయటానికి సిగ్గు ఉండాలన్నారు. నిజం చెబితే తల వక్కలు అవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఆయన అబద్దాలతో లేఖ రాశారని మంత్రి విమర్శించారు.