మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు.
చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన హయాంలో రైతులు అల్లాడనిపోయారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. దళారులకు డబ్బు పోకుండా అది కూడా రైతులకే అందేలా చర్యలు చేపట్టామన్నారు. గన్నీ