ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.. కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.. రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరనికి 50 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.
సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆమె ఆరోపించారు.
కేంద్ర నగర వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నివాసంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు.