Hebbal Flyover Bus Accident: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు అదుపుతప్పి.. ముందున్న పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Paris Olympics 2024: రూ.470 కోట్ల ఖర్చు.. పతకాలు మాత్రం ఆరు! ఒక్కో పతకంకు 78 కోట్లు
హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. అయితే ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సుమారు 10 సెకన్ల పాటు బస్సు ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా 2-3 ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో బస్సు అద్ధం స్వల్పంగా ధ్వంసమైంది. బ్రేక్ పెడల్ కింద వాటర్ బాటిల్ ఇరుక్కుపోయిన కారణంగా బ్రేక్ పడలేదని తెల్సుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు ఫ్లైఓవర్ పై బస్సు బీభత్సం!#Bengaluru #BusAccident #NTVNews #NTVTelugu pic.twitter.com/eCpB4kgzFh
— NTV Telugu (@NtvTeluguLive) August 13, 2024