రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల…